News April 10, 2024

ఎనిమిదేళ్లలో ఆరు రెట్లు పెరిగిన SIP పెట్టుబడులు

image

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత 8ఏళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. SIP పెట్టుబడుల విలువ 2016 APRలో రూ.3,122 కోట్లు ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరికి రూ.19,187 కోట్లకు చేరింది. 2015 మార్చిలో 73లక్షలుగా ఉన్న SIP అకౌంట్లు ఇప్పుడు 8.20కోట్లకు చేరినట్లు AMFI వెల్లడించింది. ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ పేరుతో కేంద్రం చేసిన విస్తృత ప్రచారమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.

Similar News

News November 7, 2025

ఈ పొజిషన్‌లో నిద్రపోతున్నారా?

image

నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడుచుకుని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బోర్లా పడుకుంటే మెడ కండరాలపై, నడుముపై ఒత్తిడి పడుతుందని పేర్కొంటున్నారు. ఇక మోకాళ్లను ముడుచుకుని ఒక వైపుకు పడుకోవడం వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలంటున్నారు.

News November 7, 2025

ఫ్లైట్స్ డిలే.. క్రమంగా తొలగుతున్న సమస్య!

image

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తలెత్తిన టెక్నికల్ <<18227103>>సమస్య<<>> క్రమంగా తొలగుతున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి విమానాలు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా టెక్నికల్ గ్లిచ్‌తో ఏటీఎస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన 500కు పైగా విమానాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలోనూ ఈ సమస్య ఎదురైంది.

News November 7, 2025

బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

image

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.