News November 3, 2025

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

జనసమూహం ఉన్న చోట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్వతీపురం మన్యం కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, ఫైర్ సర్వీసెస్, వైద్యారోగ్య శాఖ, నిర్వాహకులు నిరంతరం సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని సూచించారు. రద్దీని నివారించడానికి అవసరమైన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. అగ్నిమాపక, వైద్యసహాయ బృందాలు అందుబాటులో ఉండాలన్నారు.

Similar News

News November 4, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి: అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

News November 4, 2025

డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

image

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.