News April 10, 2024

లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: సీఎం

image

AP: ప్రపంచంలోనే వ్యవసాయం దండగ అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని CM జగన్ ఫైర్ అయ్యారు. ‘రైతు రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ హామీలన్నీ ఎగ్గొట్టాడు. రైతన్నలకు మేం తోడుగా నిలిచాం. మోసాలు చేసే చంద్రబాబు కావాలా? లేక వ్యవసాయానికి అండగా ఉంటున్న జగన్ కావాలా? సంక్షేమ కార్యక్రమాలతో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన, పథకాలు అందించాం’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News January 30, 2026

రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

image

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

News January 30, 2026

కళ్లు మూసి తెరిచేలోపే SMలో ఇంత జరుగుతుందా?

image

సోషల్ మీడియాలో ఒక్క సెకనులో ఏం జరుగుతుందో గూగుల్ GEMINI ఆసక్తికర డేటాను వెల్లడించింది. దీని ప్రకారం సెకనుకు వాట్సాప్‌లో 10 లక్షల మెసేజ్‌లు, ఇన్‌స్టాలో 1,000 ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ‘X’లో 10 వేల ట్వీట్స్ చేస్తుంటే గూగుల్‌లో లక్షకు పైగా సెర్చ్‌లు జరుగుతున్నాయి. ఇక యూట్యూబ్‌లో 90 వేల వీడియోలు చూస్తున్నారు. మనం కనురెప్ప వేసి తెరిచేలోపు డిజిటల్ ప్రపంచం ఇంతలా కదులుతోందన్నమాట.

News January 30, 2026

చర్చలకు మాస్కో రండి.. జెలెన్‌స్కీకి రష్యా ఆహ్వానం

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.