News April 10, 2024
హైదరాబాద్‌లో 15 పెట్టెల్లో నగదు పట్టివేత

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీగా నగదు పట్టుబడింది. కియా కారులో 15 పెట్టెల్లో రూ. 2కోట్ల డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్నామని, తరలింపుపై ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.
Similar News
News March 8, 2026
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు.. ఆదేశాలు జారీ

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అధికారులు 200 గజాల స్థలాన్ని గుర్తించి నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. ఒక్కో భవనాన్ని ₹10L ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించింది. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. కాగా డ్వాక్రా సంఘాల్లో 63L మంది సభ్యులున్నారు.
News March 8, 2026
ఈ నెల 13న ఓటీటీలోకి ఫంకీ

విశ్వక్‌సేన్-అనుదీప్ కాంబోలో వచ్చిన ‘ఫంకీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ నెల 13వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ FEB 13న రిలీజై బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో పలువురు డైరెక్టర్లు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.
News March 8, 2026
వారంలో సుప్రీంలీడర్ ఎంపిక: ఇరాన్ ప్రతినిధి

వారంలో సుప్రీంలీడర్ ఎంపిక జరుగుతుందని ఇండియాలో ఇరాన్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ తెలిపారు. ‘సుప్రీంలీడర్‌ను 88 మంది నిపుణుల బృందం నామినేట్ చేస్తుంది. US, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆ బృందం భేటీ జరగలేదు. అందుకే ఆలస్యం. ఒకవేళ కొత్త లీడర్‌ను US చంపితే, ఇంకొకరిని ఎంచుకుంటాం. మీరు 9 కోట్ల మందినీ చంపలేరు. అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. రెండేళ్లు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


