News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.

Similar News

News November 4, 2025

చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

image

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్‌పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

News November 4, 2025

GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు

image

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్‌పేట్ గౌతమ్‌నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మిల్లీమీటర్లు, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.

News November 4, 2025

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

image

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌ షోతోపాటు కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.