News April 10, 2024
జన్మభూమి కమిటీ సభ్యులే వాలంటీర్లు: సీఎం జగన్

AP: చంద్రబాబు సీఎం అయితే జన్మభూమి కమిటీ సభ్యుల్ని వాలంటీర్లుగా తీసుకొస్తారని సీఎం జగన్ అన్నారు. వాళ్లకు దోచిపెట్టేందుకే రూ.10వేలు జీతం ఇస్తాననే హామీ ఇచ్చాడని ఆరోపించారు. ‘వృద్ధులకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ను చంద్రబాబు ఆపించారు. ఇప్పుడు గాలి ఎదురు తిరగడంతో మళ్లీ మోసపు హామీలిస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసి మోసం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలి’ అని కోరారు.
Similar News
News March 9, 2026
ఏపీలో సర్పంచ్ ఎన్నికలు.. UPDATE

AP: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన గడువును SEC పొడిగించింది. ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియగా ఈ నెల 18 వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం నియమించిన <<19292949>>ఏకసభ్య కమిషన్<<>> నివేదిక రావడానికి 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.
News March 9, 2026
పెళ్లి తర్వాత షూటింగ్‌లో విజయ్ బిజీ!

రష్మికతో పెళ్లి కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌లకు విరామం ఇచ్చిన విజయ్ దేవరకొండ మళ్లీ బిజీ కానున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రీకరణలో ఈ నెల 12 నుంచి పాల్గొననున్నట్లు సమాచారం. కర్నూలులో జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులంతా పాల్గొంటారని తెలుస్తోంది. రష్మికతో కలిసి విజయ్ నటిస్తోన్న ఈ హ్యాట్రిక్ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
News March 9, 2026
చట్టసభల్లో మహిళలు 10 శాతమే!

దేశంలో 4,666 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలు ఉంటే వారిలో మహిళల వాటా 10% (464) ఉందని ADR రిపోర్ట్ వెల్లడించింది. 543 మంది LS ఎంపీల్లో 74 (14%) మంది మహిళలు ఉన్నారు. 4,123 మంది ఎమ్మెల్యేలలో 390 (9%) మంది మహిళలే ఉన్నారు. బీజేపీలో (31), కాంగ్రెస్ (13), తృణమూల్ (11)లో అత్యధిక మహిళా MPలు ఉన్నారు. అటు ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1957 LS పోల్స్‌లో 45 మందే ఉండగా 2024లో అది 800కు చేరింది.


