News April 10, 2024

BIG BREAKING: ఫలితాలు విడుదల

image

AP: గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News February 21, 2026

టాటా పంచ్ ఈవీ కొత్త వెర్షన్.. మిడిల్ క్లాసే టార్గెట్!

image

మిడిల్ క్లాస్ మార్కెటే లక్ష్యంగా టాటా మోటార్స్ పంచ్ ఈవీలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం బడ్జెట్ కార్లలో ఈవీలకు అంతగా డిమాండ్ లేకపోవడంతో దానిని బ్రేక్ చేయాలని టాటా భావిస్తోంది. అందుకే ప్రారంభ ధర ₹9.69లక్షలకే (ఎక్స్-షోరూమ్) సెట్ చేసింది. battery-as-a-service ఆప్షన్ ఉండటంతో కారు ₹6.49లక్షలకే రానుంది. కేవలం కారుకే డబ్బు చెల్లించి, బ్యాటరీకి <<19172419>>అద్దె<<>> రూపంలో చెల్లించేది ఈ Baas కాన్సెప్ట్.

News February 21, 2026

సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్.. ఎల్లుండి జట్టులోకి ఎంట్రీ?

image

అభిషేక్ వరుస డకౌట్లు, తిలక్ పెద్దగా రాణించకపోవడంతో వీరిలో ఒకరి స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రికెట్ సర్కిళ్లో బజ్ నడుస్తోంది. ఆదివారం SAతో జరిగే సూపర్-8 మ్యాచ్‌లో ఆడతారని క్రీడావర్గాలు అంచనా వేస్తున్నాయి. అహ్మదాబాద్‌ పిచ్ స్పిన్‌కు అనుకూలమని, స్పిన్నర్లపై అటాక్ చేసే సంజూను ప్లేయింగ్11లోకి తీసుకుంటారని అంటున్నాయి. అటు ఇవాళ శాంసన్ గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం వీటికి బలం చేకూరుస్తున్నాయి.

News February 20, 2026

ఆర్టీఐ యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరు: హైకోర్టు

image

రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. RTI యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు కాంత కుమావత్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఏ విధమైన ప్రజాప్రయోజనం లేని సందర్భాల్లో సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక వ్యక్తిగత అంశం. RTI పరిధిలోకి రాదు. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదు’ అని న్యాయస్థానం పేర్కొంది.