News November 3, 2025
NTR: జోగి రమేశ్ భార్య, కుమారులపై కేసు నమోదు

మాజీ మంత్రి జోగి రమేశ్ భార్య, కుమారుడిపై విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జోగి రమేశ్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు జీజీహెచ్‌లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టారు. దీంతో జోగి రమేశ్ భార్య శకుంతల ఏ1, కుమారుడు రాజీవ్ ఏ2, మరో కుమారుడు రోహిత్ ఏ3గా మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 4, 2025
శబరిమల యాత్రికులకు రూ.6కోట్లతో ఆస్పత్రి

శబరిమల యాత్రికుల కోసం రూ.6.12కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆస్పత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీలక్కల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకూ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భూమి కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఎమర్జెన్సీ, ICU, ECG విభాగాలుంటాయని తెలిపారు.
News November 4, 2025
దీపావళి, కార్తీక పౌర్ణమి రోజుల్లో బాణాసంచా ఎందుకు కాల్చుతారు?

భాద్రపద మాసంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వర్షాల కారణంగా భూమిపై విషపూరితమైన ఆవిరి పేరుకుపోతుంది. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పర్వదినాల్లో పసుపు, గంధకం, సురేకారం వంటి ద్రవ్యాలతో తయారుచేసే బాణాసంచాను కాల్చుతారు. వీటి నుంచి వచ్చే విపరీత కాంతి, పెద్ద ధ్వని, పొగ.. ఇవన్నీ క్రిమి సంహారిణిగా పనిచేసి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.
News November 4, 2025
గద్వాల: భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్లు జైలు

అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన చాకలి హరికృష్ణ తన భార్య మల్లికను వేధించడంతో ఈ ఘటన జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. మల్లిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


