News November 3, 2025
రోడ్డుపై గుంత, అతివేగం.. 19 మంది బలి!

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183462>>బస్సు<<>> ప్రమాదానికి టిప్పర్ అతివేగంతో పాటు ఓ గుంత కూడా కారణమని తెలుస్తోంది. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో 50-60 టన్నుల కంకర బస్సుపై పడటంతో అందులోని ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. బస్సులో కెపాసిటీకి మించి 72 మంది ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
Similar News
News November 4, 2025
‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.
News November 4, 2025
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని జీరోని చేస్తుంది!

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే కూడా పనిని వాయిదా వేసే అలవాటు చాలా డేంజరని లైఫ్‌స్టైల్ కోచ్‌లు హెచ్చరిస్తున్నారు. ‘విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎందులోనైనా మీరు చేయాలి అనుకున్న/చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయాలి. టైముంది కదా తర్వాత చేద్దామన్న థాట్ మీ ప్రొడక్టవిటీని, వర్క్ క్వాలిటీని, అవకాశాలను కిల్ చేస్తుంది. లైఫ్‌లో మిమ్మల్ని జీరోగా నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని హెచ్చరిస్తున్నారు.
News November 4, 2025
Amazon layoffs: ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఆఫీసుకు వెళ్లే ముందు మీ వ్యక్తిగత లేదా ఆఫీసు మెయిల్‌ను చెక్ చేసుకోండి’ అని ఫస్ట్ మెసేజ్‌లో కోరింది. ‘మీ జాబ్ గురించి మెయిల్ రాకపోతే హెల్ప్ డెస్క్ నంబర్‌ను సంప్రదించండి’ అని రెండో దాంట్లో పేర్కొంది. లేఆఫ్ మెయిల్స్ పంపాక ఈ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం.


