News November 3, 2025
US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.
Similar News
News November 4, 2025
జాలర్ల విడుదలకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు: కలెక్టర్

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 9 మంది జాలర్లు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి అప్పన్న ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఎంబసీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, జాలర్ల విడుదల కోసం ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
News November 4, 2025
నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.


