News November 3, 2025

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ASF ఎస్సీ

image

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

Similar News

News November 4, 2025

జాలర్ల విడుదలకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు: కలెక్టర్

image

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 9 మంది జాలర్లు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి అప్పన్న ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఎంబసీతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, జాలర్ల విడుదల కోసం ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

News November 4, 2025

SU B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ పరీక్షలు NOV 13 తేదీ నుంచి DEC 4వ తేదీ వరకు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

News November 4, 2025

పుంగనూరులో విషాదం

image

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.