News November 3, 2025

NGKL: గత ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తిచేయలేకపోయింది: సీఎం

image

గత పదేళ్లలో 10 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తమ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 30 కి.మీ.ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు.

Similar News

News November 4, 2025

వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి గురువు ఎవరు?
2. మేఘనాదుడు ఎవరిని పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు?
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ఏమిటి?
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ఏమిటి?
5. సీత స్వయంవరం లో ఉన్న శివధనుస్సు అసలు పేరు ఏమిటి?
– సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

ADB: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

image

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, తలమడుగు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, దిలావర్పూర్, లక్ష్మణచాంద కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.