News November 3, 2025
GWL: ప్రజావాణికి 132 ఫిర్యాదులు

గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 60 దరఖాస్తులు అందాయని చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News November 4, 2025
కరీంనగర్: SU B.com, Bsc పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న బి.కాం (బి.ఎస్.ఎఫ్.ఐ) ఈ-కామర్స్, బీ.ఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగంలో 1వ సెమిస్టర్ పరీక్షల <<18189571>>ఫీజు<<>> నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 07 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.
News November 4, 2025
హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
News November 4, 2025
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.


