News April 10, 2024

సీఎంను తొలగించాలన్న పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం

image

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇప్పటి వరకు సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ ముఖ్యమంత్రిని తొలగించిన సందర్భాలున్నాయా? ఉంటే మాకు చూపించండి. ఈ అంశంపై దాఖలైన మూడో పిటిషన్ ఇది. సీక్వెల్స్ ఉండటానికి ఇదేం జేమ్స్ బాండ్ సినిమా కాదు. తొలగింపుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Similar News

News April 20, 2026

వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

image

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.

News April 20, 2026

ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

image

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.