News November 3, 2025
‘భారీ, మధ్యతరహా వస్త్ర పరిశ్రమలను ప్రోత్సహించండి’

జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఔత్సాహిక వస్త్ర టెక్స్టైల్ పారిశ్రామికవేత్తలకు సంబంధిత అధికారులు ప్రోత్సాహం అందించాలన్నారు. పరిశ్రమలకు భూములు కావలసినవారు ఈనెల 7న ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో నిర్వహించే రోడ్ షోకు హాజరుకావాలన్నారు. ఏపీఐఐసీ, జోనల్, జనరల్ మేనేజర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News November 4, 2025
శ్రీకాళహస్తి: తండ్రి, కుమారుడి మృతి

నాయుడుపేట-పూతలపట్టు హైవేలో నిన్న రోడ్డు <<18184479>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం(31) కుమారుడు రూపేశ్(11)తో కలిసి బైకుపై నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తుండగా గురప్పతోట దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. స్పాట్‌లో తండ్రి చనిపోగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రూపేశ్ మరణించాడు. భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య బోరున విలపించారు.
News November 4, 2025
HYD: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT
News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.


