News November 3, 2025
ఎన్టీఆర్: MBA/MCA పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో MBA/MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. NOV 13 నుంచి 24 మధ్య MBA, NOV 13 నుంచి 18 మధ్య MCA పరీక్షలను (ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట సెషన్‌లో)వర్సిటీ పరిధిలోని 5 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.
Similar News
News November 4, 2025
MNCL: నేటి నుంచి చేప పిల్లలు విడుదల

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 380 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 2.23 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల 115.65 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల 108.28 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నారు.
News November 4, 2025
అమరావతి: నాగవైష్ణవి హత్య కేసు.. అతడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్ట్

విజయవాడలో 2010లో సంచలనం సృష్టించిన చిన్నారి <<18192679>>నాగవైష్ణవి హత్య కేసులో<<>> A3 నిందితుడిగా ఉన్న బాలిక మావయ్య పంది వెంకటరావు/కృష్ణకు భారీ ఊరట లభించింది. అతడికి కింది కోర్టు గతంలో జీవితఖైదు విధించగా హైకోర్టులో అప్పీల్ చేసుకోగా సోమవారం కేసు విచారణకు వచ్చింది. చిన్నారి హత్యలో కృష్ణ పాత్ర ఉన్నట్లు సాక్ష్యాలు లేవంటూ అతడి తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం జీవితఖైదును రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.
News November 4, 2025
విజయవాడ: పలగాని నాగవైష్ణవి హత్య కేసు ఏమిటంటే?

విజయవాడకు చెందిన ప్రభాకర్.. మేనకోడల్ని పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టకపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు వైష్ణవితో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడైన కృష్ణ.. ఆస్తి 2వ భార్యకు దక్కుతుందని భావించి <<18192610>>వైష్ణవిని.. శ్రీనివాస్, జగదీశ్ సాయంతో గుంటూరు తీసుకొచ్చి చంపారనేది కేసు. కుమార్తె మృతితో ప్రభాకర్ హఠాన్మరణం చెందగా కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది.


