News November 3, 2025

పుట్టపర్తి కలెక్టరేట్‌కు 306 అర్జీలు: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. నాణ్యతే ప్రామాణికంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి 306 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

Similar News

News November 4, 2025

నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

image

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.

News November 4, 2025

నంద్యాల జిల్లాలో భారీ వర్షం

image

నంద్యాల జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, నరసాపురం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తాజా వర్షాలతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు విలపిస్తున్నారు. వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

News November 4, 2025

శ్రీకాళహస్తి: తండ్రి, కుమారుడి మృతి

image

నాయుడుపేట-పూతలపట్టు హైవేలో నిన్న రోడ్డు <<18184479>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం(31) కుమారుడు రూపేశ్(11)తో కలిసి బైకుపై నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తుండగా గురప్పతోట దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. స్పాట్‌లో తండ్రి చనిపోగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రూపేశ్ మరణించాడు. భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య బోరున విలపించారు.