News November 3, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 105 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ 105 దరఖాస్తులను స్వీకరించారు.
Similar News
News November 4, 2025
నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
News November 4, 2025
నంద్యాల జిల్లాలో భారీ వర్షం

నంద్యాల జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, నరసాపురం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తాజా వర్షాలతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు విలపిస్తున్నారు. వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.
News November 4, 2025
శ్రీకాళహస్తి: తండ్రి, కుమారుడి మృతి

నాయుడుపేట-పూతలపట్టు హైవేలో నిన్న రోడ్డు <<18184479>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం(31) కుమారుడు రూపేశ్(11)తో కలిసి బైకుపై నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తుండగా గురప్పతోట దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. స్పాట్‌లో తండ్రి చనిపోగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రూపేశ్ మరణించాడు. భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య బోరున విలపించారు.


