News April 10, 2024

డీఎంకే అహంకారంలో మునిగిపోయింది: పీఎం మోదీ

image

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకేపై పీఎం మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీ అహంకారంలో మునిగిపోయింది. ఆ దురహంకారాన్ని ప్రజలు హర్షించరు. విభజన రాజకీయాలే డీఎంకే మార్గం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేదు. మేం రాష్ట్రాల్లో రక్షణ నడవాలను నిర్మిస్తున్నాం. విభజనే లక్ష్యంగా పనిచేసే ఇండియా కూటమి అలా చేయగలదా? వారసత్వ రాజకీయాలే వారి లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 19, 2026

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి SIR!

image

దేశవ్యాప్తంగా SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు EC సిద్ధమవుతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని AP, TG సహా 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. APR నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR పూర్తవగా, ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.

News February 19, 2026

విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

image

UP కాన్పూర్‌లో జరిగిన అండర్-13 మ్యాచులో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో అంపైర్ మాణిక్ గుప్తా (65) ప్రాణాలు కోల్పోయారు. ముఖం, శరీరం చుట్టూ పెద్దసంఖ్యలో తేనెటీగలు కుట్టడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో ఫీల్డ్ అంపైర్, 15-20 మంది ఆటగాళ్లు సైతం గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

News February 19, 2026

డీల్ చేసుకోండి.. లేదంటే దాడి తప్పదు: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా భారీగా సైనిక బలగాలను <<19181534>>మోహరిస్తున్న<<>> వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో అర్థవంతమైన డీల్ చేసుకోవాలని, లేదంటే దాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘ఇరాన్‌తో డీల్ సులభం కాదని తేలిపోయింది. డీల్ జరగకపోతే పర్యవసానాలు తప్పవు. మరో 10 రోజుల్లోనే దాన్ని తెలుసుకుంటారు’ అని వార్నింగ్ ఇచ్చారు.