News November 3, 2025

మరో 6 నెలలు కాల్పుల విరమణ: ‘మావో’ లేఖ

image

కాల్పుల విరమణ మరో 6 నెలలు కొనసాగిస్తామని మావోయిస్టు నేత జగన్ పేరిట ఓ లేఖ విడుదల విడుదలైంది. మే నుంచి తెలంగాణలో 6 నెలల పాటు తాము కాల్పులు విరమించామని, ఈ మేరకు శాంతియుత వాతావరణం కొనసాగేలా మరో 6 నెలలు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా కాల్పుల విరమణ కొనసాగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

Similar News

News November 4, 2025

విజయవాడలో ఫ్రీగా క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎవరికీ తెలియనివ్వరా?

image

విజయవాడలోని కొత్త, పాత ఆసుపత్రుల్లో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తుగానే వ్యాక్సిన్ వేస్తున్నారు. 5 రకాల క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుంది. రూ.3-5 వేల వరకు ఉండే ఈ వ్యాక్సిన్‌ను 9-15 ఏళ్ల బాలికలు, 15-30 మధ్య మహిళలకు 3 డోసులను అందిస్తారు. అయితే.. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం కనీసం ప్రచారం చేయట్లేదు. తెలిసిన వారికే ప్రాధాన్యం అన్నట్లు డోసులు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

News November 4, 2025

SRD: ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు

image

SRD జిల్లా ఝరాసంగం మం.లో ప్రేమ పెళ్లి చేసుకున్నారని యువతి కుటుంబీకులు దారుణానికి ఒడిగట్టారు. కొద్దీ రోజుల క్రితం విఠల్ కూతురు అదే గ్రామ వాసి రాధాకృష్ణను పెళ్లి చేసుకుంది. అదిఇష్టం లేని యువతి తండ్రి, కొడుకుతో కలిసి యువకుడిని, అతడి తండ్రిపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 4, 2025

అల్లూరి జిల్లాలో భూకంపం

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం నమోదైనట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. జి.మాడుగుల పరిసరాల్లో భూమి కంపించినట్లు కొందరు చెబుతున్నారు.