News November 3, 2025
హెల్మెట్ ధరిస్తేనే అల్లూరి జిల్లాలోకి అనుమతి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. టూ వీలర్స్ వినియోగదారులు హెల్మెట్ ధరిస్తేనే జిల్లాలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసి హెల్మెట్ లేని వారిని, మద్యం సేవించి వాహనం నడుపుతున్న అనుమతించరాదని పోలీసులను ఆదేశించారు.
Similar News
News November 4, 2025
రేపు కందికొండ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ జాతర బుధవారం ప్రారంభం కానుంది. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రకృతి ఆలయంలో ఏటా కార్తీక పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవోపేతంగా నిర్వహిస్తారు. కందగిరి గుట్టపై తొలుత ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆపైన కొండ శిఖరంపై ఉన్న నరసింహ స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేస్తారు.
News November 4, 2025
జన్నారం: లారీ-బైక్ ఢీ.. ఒకరి స్పాట్ డెడ్

జన్నారం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. చింతగూడ-మహమ్మదాబాద్ గ్రామాల మధ్య లారీ-బైక్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 4, 2025
రూ.1.32 కోట్ల నిధుల హాంఫట్.. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించిన కలెక్టర్

రూ.1.32 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయినందున కలెక్టర్ DK బాలాజీ గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్యను పదవి నుంచి తొలగించారు. జిల్లా పంచాయితీ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ ఆమెను సోమవారం తొలగించారు. విలేజ్ సెక్రటరీతో కలసి నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కాగా..చెరో రూ.66.05 లక్షలు 9 నెలల్లోపు చెల్లించాలని నోటీసులివ్వగా వారు చెల్లించకపోవడంతో కలెక్టర్ ఆమెను తొలగించారు.


