News April 10, 2024

ఎన్నికల తర్వాత టారిఫ్ పెంచనున్న నెట్‌వర్క్స్?

image

టెలికాం సంస్థలు త్వరలో మొబైల్ టారిఫ్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య సంస్థలు 15%-17% ధరలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధిపొందుతుందన్నారు. ఎయిర్‌టెల్‌కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం రూ.208గా ఉండగా FY27కు అది రూ.286కి పెరగనుందట. కాగా 2021 DECలో 20%, 2019లో 20-40% చొప్పున టారిఫ్ పెరిగింది.

Similar News

News October 10, 2024

ఒకే ఇంట్లో నలుగురు MBBSలు

image

TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.

News October 10, 2024

800: 147 ఏళ్ల చరిత్రలో నాలుగోసారే

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ 823/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో 800కుపైగా పరుగులు నమోదయ్యాయి. అలాగే 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇప్పటివరకు శ్రీలంక, ఇంగ్లండ్ మాత్రమే 800కుపైగా స్కోర్లు చేశాయి. లంక ఓసారి, ఇంగ్లండ్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించాయి. మరో వైపు ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి ఆరుగురు పాక్ బౌలర్లు 100కుపైగా పరుగులు ఇచ్చుకున్నారు.

News October 10, 2024

సొంత ఎమ్మెల్యేలపైనే బాబు బురద జల్లుతున్నారు: రోజా

image

AP: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే బురద జల్లుతున్నారని సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. ‘మొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనే మాది పొలిటికల్ గవర్నెన్స్.. మా వారు చెప్పిందే చేయండి’ అని చెప్పారు. దందాలపై వ్యతిరేకత వచ్చే సరికి ఇప్పుడు తప్పులను ఎమ్మెల్యేలపై నెడుతున్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.