News November 3, 2025

సిరిసిల్ల: చేప పిల్లల పంపిణీపై మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలోని జలవనరుల్లో చేప పిల్లల పంపిణీని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మత్స్య శాఖపై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

image

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్‌కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్‌వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్‌తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

News November 4, 2025

జీలుగుమిల్లి: ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

image

జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో మంగళవారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి అఖిల్ (22) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్‌.ఐ వి. క్రాంతికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 4, 2025

చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.