News November 3, 2025
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

ఈ నెల 15న నిర్వహించబోయే లోక్ అదాలత్‌పై కోర్టు న్యాయవాదులతో జనగామ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం సమావేశం నిర్వహించారు. సివిల్, మ్యాట్రిమోనియల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్‌తో లాగి పలు కేసుల రాజీ పద్ధతిపై చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
News November 4, 2025
టైం పాస్ కోసం జగన్ నకిలీ యాత్ర: TDP

వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై TDP ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. బెంగళూరులో సేద తీరిన గెస్ట్ పొలిటీషియన్ సరదాగా టైం పాస్ చేయటానికి ఒక నకిలీ యాత్ర పెట్టుకున్నాడు’ అని విమర్శించింది. ఎలాగూ ప్రజలు తిరస్కరిస్తారు కాబట్టి జనాలకి ఒక్కొక్కరికీ రూ.1000, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి నకిలీ యాత్ర చేస్తున్నాడని సెటైర్లు వేసింది. దీనిపై మీ కామెంట్.
News November 4, 2025
సిరిసిల్ల: శిక్ష నుంచి నేరస్థులు తప్పించుకోలేరు: ఎస్పీ

నేరం చేసిన వారెవరూ శిక్ష నుంచి రేరస్థులు తప్పించుకోలేరని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మొత్తం 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


