News November 3, 2025

భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు తరలివస్తారని, భద్రత చర్యలకు పెద్దపీట వేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సూచించారు. జిల్లా దేవాదాయ శాఖ, పాలకమండలి అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాదాయ శాఖ, ప్రైవేట్ ఆలయాల్లో క్యూ లైన్, మార్గాల తదితర ఏర్పాట్లపై పోలీసుల సహకారంతో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Similar News

News November 4, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.

News November 4, 2025

టైం పాస్ కోసం జగన్ నకిలీ యాత్ర: TDP

image

వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై TDP ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. బెంగళూరులో సేద తీరిన గెస్ట్ పొలిటీషియన్‌ సరదాగా టైం పాస్ చేయటానికి ఒక నకిలీ యాత్ర పెట్టుకున్నాడు’ అని విమర్శించింది. ఎలాగూ ప్రజలు తిరస్కరిస్తారు కాబట్టి జనాలకి ఒక్కొక్కరికీ రూ.1000, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి నకిలీ యాత్ర చేస్తున్నాడని సెటైర్లు వేసింది. దీనిపై మీ కామెంట్.

News November 4, 2025

సిరిసిల్ల: శిక్ష నుంచి నేరస్థులు తప్పించుకోలేరు: ఎస్పీ

image

నేరం చేసిన వారెవరూ శిక్ష నుంచి రేరస్థులు తప్పించుకోలేరని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మొత్తం 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.