News November 3, 2025

పెద్దపల్లి: ‘కనీస విద్యా ప్రమాణాలు 90% మంది విద్యార్థులకు అందించాలి’

image

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 90% మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ముగిసేలోపు కనీస విద్యా ప్రమాణాలను చేరుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సోమవారం హెడ్‌మాస్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో చదవడం, రాయడం, లెక్కల నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలు నెలవారీ లక్ష్యాలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

Similar News

News November 4, 2025

NGKL: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు:DMHO

image

ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్స్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ABAS అటెండెన్స్ అందరూ టైంలో పెట్టాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని కోరారు.

News November 4, 2025

విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 4, 2025

పాల్వంచ: ఈనెల 6న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువత కోసం ఈనెల 6న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సేల్స్ కన్సల్టెంట్(Male) 13 పోస్టులకు గాను ఏదైనా డిగ్రీ, టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సర్వీస్ అడ్వైజర్ 2 పోస్టులకు గాను డీజిల్ మెకానిక్/బీ.టెక్ మెకానిక్ పూర్తిచేసి 22-30 ఏళ్ల మధ్య గలవారు ఉదయం 10 గంటలకు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.