News April 10, 2024

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు బెయిల్

image

BRS మాజీ MLA షకీల్ కుమారుడు రాహిల్‌కు హిట్ అండ్ రన్ కేసులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ ఆ తర్వాత దుబాయ్ పారిపోయారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 10, 2024

ఇక సెలవు.. ‘టాటా’

image

పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రస్థానం ముగిసింది. ముంబైలోని వర్లి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. టాటా కడసారి చూపుకోసం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వేలాదిగా తరలివచ్చారు. తన 86 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమందికి జీవితాన్నిచ్చిన పారిశ్రామిక ‘రత్నం’ దివికేగింది.

News October 10, 2024

ఏపీకి వెళ్లే IAS, IPS ఆఫీసర్లు వీరే..

image

ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి <<14323982>>రిలీవ్<<>> చేసింది. ఈ నెల 16 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఉన్నారు. తమను తెలంగాణకు కేటాయించాలని కోరగా కేంద్రం తిరస్కరించింది.

News October 10, 2024

ఒకే ఇంట్లో నలుగురు MBBSలు

image

TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.