News November 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
✓చేపల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు: కలెక్టర్
✓జిల్లా మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
✓చర్ల: ఇసుక ర్యాంప్ ను వెంటనే ప్రారంభించాలి
✓సుజాతనగర్: అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షల విరాళం
✓ఆధారాలు చూపిస్తే మణుగూరు ఆఫీసును మేమే ఇచ్చేవాళ్లం: రేగా
✓టేకులపల్లి గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఐటీడీఏ ఏఈ
Similar News
News November 4, 2025
VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.
News November 4, 2025
వరంగల్: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. ఉమ్మడి WGLలో 21 స్టాఫ్ అసిస్టెంట్‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT
News November 4, 2025
NGKL: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు:DMHO

ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్స్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ABAS అటెండెన్స్ అందరూ టైంలో పెట్టాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని కోరారు.


