News November 4, 2025
మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.
Similar News
News November 4, 2025
మెదక్: స్పెషల్ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
News November 4, 2025
ఏటూరునాగారం: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా

ఏటూరునాగారం ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 10న ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.
News November 4, 2025
అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలకు రెక్కలు

అల్లూరి జిల్లాలో కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. పాడేరులో గత వారం చిక్కుడు కాయలు కిలో రూ.100ఉండగా నేడు 160కి వీరిగిపోయింది. అల్లం కిలో రూ.60 ఉండగా నేడు రూ.120కి పెరిగిందని వినియోగదారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తున్న కూరగాయలు తోటలు వర్షాలకు దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.


