News November 4, 2025
చిత్తూరు: ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్యశాల నూతన భవనాన్ని చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందికి ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.
News November 4, 2025
చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.
News November 4, 2025
చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.


