News November 4, 2025

సంగారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్య‌కు కారణం ఇదే.!

image

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా లక్షల రూపాయలు నష్టపోవడంతో కానిస్టేబుల్ సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై ఆత్మహత్య చేసుకున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ గతంలో శిక్షణ సమయంలోనూ గేమింగ్ వ్యసనంతో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

Similar News

News November 4, 2025

ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.

News November 4, 2025

రేపు కడపకు రానున్న AR రెహమాన్

image

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.

News November 4, 2025

జగన్ కాన్వాయ్‌ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

image

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్‌ను బైక్‌పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.