News November 4, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 4, 2025
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు.
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.
News November 4, 2025
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

నిరుపేదల సంక్షేమం కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే లబ్ధిదారులను, అధికారులను ఆదేశించారు. మంగళవారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో కొనసాగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో ఈ గ్రామం మొదటి విడత మోడల్ గ్రామంగా ఎంపికైందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


