News November 4, 2025

దుర్గగుడి చైర్మన్ ఫ్రస్ట్రేషన్..!

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దుర్గగుడి ఉద్యోగులపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తనకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని, గౌరవం ఇవ్వట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు లేఖ కూడా రాసినట్లు ఆయన చెబుతున్నారట. దీంతో దుర్గ గుడిలో చైర్మన్ Vs ఉద్యోగుల మధ్య వార్ నడుస్తోందనే చర్చ జోరుగా జరుగుతోంది.

Similar News

News November 4, 2025

నిర్మల్: ఈనెల 6న వాహనాలకు వేలం

image

నిర్మల్ జిల్లాలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన గురువారం నిర్మల్ పట్టణ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ ఈరోజు తెలిపారు. 25 వాహనాలకు వేలం నిర్వహించనున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 4, 2025

మునగాకు పొడితో యవ్వనం

image

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.

News November 4, 2025

నిర్మల్: ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు రావడాన్ని దృష్టిలో ఉంచుకొని, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రధానంగా బాసర సరస్వతి దేవి ఆలయం, తానూర్‌‌లోని విఠలేశ్వరస్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయం, నిర్మల్‌లోని నగరేశ్వరస్వామి ఆలయం, దేవరకోట దేవస్థానం, వెంకటాపూర్‌లోని మహదేవ ఆలయం, శివకోటి మందిరాల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.