News November 4, 2025
క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు కలెక్టర్ ఆదేశాలు

యువతలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించి, మండలాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా అధికారులతో సోమవారం సమావేశం జరిగింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని, యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించేలా, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా చూడాలన్నారు.
Similar News
News November 4, 2025
నిర్మల్: ఈనెల 6న వాహనాలకు వేలం

నిర్మల్ జిల్లాలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన గురువారం నిర్మల్ పట్టణ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ ఈరోజు తెలిపారు. 25 వాహనాలకు వేలం నిర్వహించనున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 4, 2025
మునగాకు పొడితో యవ్వనం

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.
News November 4, 2025
నిర్మల్: ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు రావడాన్ని దృష్టిలో ఉంచుకొని, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రధానంగా బాసర సరస్వతి దేవి ఆలయం, తానూర్‌లోని విఠలేశ్వరస్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయం, నిర్మల్‌లోని నగరేశ్వరస్వామి ఆలయం, దేవరకోట దేవస్థానం, వెంకటాపూర్‌లోని మహదేవ ఆలయం, శివకోటి మందిరాల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.


