News November 4, 2025
మెడికల్ ఎగ్జామినేషన్‌లో ప్రైవసీ

BNS సెక్షన్ 53(2) ప్రకారం, క్రిమినల్ కేసుల వైద్యపరీక్షల సమయంలో ఒక మహిళను వైద్యురాలు లేదా ఆమె పర్యవేక్షణలో మాత్రమే పరీక్షించాలి. సెన్సిటివ్ మెడికల్ ప్రొసీజర్స్‌లో మహిళల కంఫర్ట్, కన్సెంట్, డిగ్నిటీ కాపాడేందుకు ఈ హక్కు కల్పించారు. అలాగే సెక్షన్ 179 ప్రకారం మహిళలను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. పోలీసులే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి.
Similar News
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 4, 2025
వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
News November 4, 2025
మునగాకు పొడితో యవ్వనం

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.


