News November 4, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

image

సత్యసాయి (D) చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐచర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.

Similar News

News November 4, 2025

ఘణపురం: కోటగుళ్లలో ఫ్రాన్స్ దేశస్థుల సందడి

image

కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం ఫ్రాన్స్ దేశస్థులు సందడి చేశారు. ఫ్రాన్స్‌కి చెందిన ఎరిఫ్, ఎలిక్‌లు ఆలయాన్ని సందర్శించారు. మొదట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పరిసరాలు, అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించారు. కోటగుళ్ల చరిత్రను ఆలయార్చకులు జూలపల్లి నాగరాజును వారు అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం అద్భుతమని కొనియాడారు.

News November 4, 2025

త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్ ఫ్లైట్

image

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. CM చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్‌గా తీసుకుని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

News November 4, 2025

జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.