News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.
Similar News
News February 18, 2026
రేపు విశాఖలో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.
News February 18, 2026
విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
News February 18, 2026
విశాఖలో అట్టహాసంగా ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖపట్నం తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 71 యుద్ధనౌకల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ‘సముద్రాల ద్వారా ఐక్యత’ (United Through Oceans) అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుక దేశాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని, వివిధ దేశాల నావికుల కలయిక ప్రపంచ ఐక్యతకు నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు.


