News November 4, 2025
శ్రీకాళహస్తి: తండ్రి, కుమారుడి మృతి

నాయుడుపేట-పూతలపట్టు హైవేలో నిన్న రోడ్డు <<18184479>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం(31) కుమారుడు రూపేశ్(11)తో కలిసి బైకుపై నాయుడుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తుండగా గురప్పతోట దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. స్పాట్‌లో తండ్రి చనిపోగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రూపేశ్ మరణించాడు. భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య బోరున విలపించారు.
Similar News
News November 4, 2025
చిత్తడి నేలల గుర్తింపుపై కలెక్టర్ సమీక్ష

పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధి దృష్ట్యా చిత్తడి నేలల సంరక్షణ అత్యంత కీలకమని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం డీఎఫ్ఓ కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు, భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, వాటి పరిరక్షణ, అభివృద్ధి, సుప్రీం కోర్టు ఆదేశాల అమలు అంశాలపై చర్చించారు.
News November 4, 2025
KNR: సర్కార్ దవాఖానాలో SCAM.. విచారణకు ఆదేశం

కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌లో <<18192226>>రూ.4.5కోట్ల నిధుల దుర్వినియోగం<<>>పై Way2Newsలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. TS MSIDC, HDS, TVVP, కాయకల్ప నిధులపై వెంటనే విచారణ చేపట్టి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని DM&HOకు ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో స్కాంకు పాల్పడ్డ అధికారులు, డాక్టర్లు, ఉద్యోగులు గజగజ వణికిపోతున్నారు.
News November 4, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. 16 ఏళ్లకే నాటక రంగంలోకి ఆమె ప్రవేశించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని సీరియల్స్, సినిమాల్లో నటించారు. దూరదర్శన్‌లో వచ్చిన ‘గజరా’తో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆత్మవిశ్వాస్, మాయాబాప్, ఖత్యాల్ సాసు నాథల్ సూన్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. అత్త పాత్రలకు కేరాఫ్ దయా అని చెబుతారు.


