News November 4, 2025

నంద్యాల జిల్లాలో భారీ వర్షం

image

నంద్యాల జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, నరసాపురం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తాజా వర్షాలతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు విలపిస్తున్నారు. వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

Similar News

News November 4, 2025

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

image

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్‌ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

News November 4, 2025

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.

News November 4, 2025

నంగునూరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మల్యాల విద్యార్థి

image

69వ ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు నంగునూరు మండలం గట్ల మల్యాల జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని డి. అను ఎంపికైనట్లు హెచ్ఎం రమేష్ తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం, జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమె రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 8, 9, 10న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే పోటీల్లో అను పాల్గొంటారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు అభినందించారు.