News November 4, 2025
పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.
Similar News
News November 4, 2025
ఇళ్లకు సమీపంలో చెట్లు ఉండకూడదా?

మర్రి, రావి, వేప వంటి పెద్ద వృక్షాలను ఇళ్లకు అతి సమీపంలో పెంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈ చెట్ల వేర్లు బలంగా విస్తరించి ఇంటి పునాదులను దెబ్బ తీసే అవకాశాలుంటాయని అన్నారు. ‘ఇది నిర్మాణానికి హాని కలిగిస్తుంది. వాస్తుపరంగా స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. ఇంటి గోడలకు నష్టం కలగకుండా, గృహ నిర్మాణం ఆయుష్షు పెరగడానికి, ఈ చెట్లను కొంత దూరంలో పెంచడం శుభకరం’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News November 4, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. 16 ఏళ్లకే నాటక రంగంలోకి ఆమె ప్రవేశించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని సీరియల్స్, సినిమాల్లో నటించారు. దూరదర్శన్‌లో వచ్చిన ‘గజరా’తో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆత్మవిశ్వాస్, మాయాబాప్, ఖత్యాల్ సాసు నాథల్ సూన్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. అత్త పాత్రలకు కేరాఫ్ దయా అని చెబుతారు.
News November 4, 2025
చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


