News November 4, 2025
నరసరావుపేట: తన ఆధార్‌తో వేరొకరి వ్యాపారం.. డబ్బులు బ్లాక్!

తన పాన్, ఆధార్ కార్డు ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశాడు. తన బ్యాంకు ఖాతా హోల్డ్ చేయమని ఖమ్మం వాణిజ్య పన్నుల శాఖ నుంచి నుంచి నోటీసు వచ్చిందన్నారు. దీంతో బ్యాంక్ అధికారులు తన లావాదేవీలు నిలిపివేసినట్లు వాపోయాడు. స్థలం మీద వచ్చిన రూ.9 లక్షలు బ్యాంకులో బ్లాక్ అయ్యాయని.. న్యాయం చేయాలని కోరాడు.
Similar News
News November 4, 2025
ఇల్లంతకుంట: ‘కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర’

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
విద్యార్థుల భవిష్యత్తు గురువుల చేతుల్లోనే: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 1వ తరగతి విద్యార్థులు కలెక్టరేట్‌ను సందర్శించారు. విద్యార్థులకు కలెక్టర్ చాక్లెట్ అందజేయగా, పాఠశాల యాజమాన్యం కలెక్టర్‌ను పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించింది.
News November 4, 2025
ASF: ‘పత్తి కొనుగోలులో పరిమితి ఎత్తివేయాలి’

ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా నాయకుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం తేమ, నాణ్యతతో పాటు పరిమితుల పేరుతో కొత్త నిబంధనలు పెట్టి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు.


