News November 4, 2025

వనస్థలిపురంలో పోస్ట్ ఆఫీస్ సేవలు 24/7

image

పోస్ట్ ఆఫీస్‌లలో 24/7 సేవలు అందుబాటులోకి తెచ్చామని ఇండియన్ పోస్ట్ హైదరాబాద్ ఆగ్నేయ మండల సీనియర్ సూపరింటెండెంట్ G.హైమవతి తెలిపారు. స్పీడ్ పోస్ట్, పార్సిల్ సర్వీస్, మనీ ఆర్డర్ సేవలను ప్రజలు అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. వనస్థలిపురం(24/7), చార్మినార్ (9PM), ఉప్పల్ (6PM), హైకోర్టు (5 PM), శంషాబాద్ 4.30PM వరకు సేవలను వినియోగించుకోవచ్చు అని G.హైమవతి తెలిపారు.
SHARE IT

Similar News

News November 4, 2025

ఇల్లంతకుంట: ‘కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర’

image

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు.

News November 4, 2025

విద్యార్థుల భవిష్యత్తు గురువుల చేతుల్లోనే: కలెక్టర్

image

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 1వ తరగతి విద్యార్థులు కలెక్టరేట్‌ను సందర్శించారు. విద్యార్థులకు కలెక్టర్ చాక్లెట్ అందజేయగా, పాఠశాల యాజమాన్యం కలెక్టర్‌ను పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించింది.

News November 4, 2025

ASF: ‘పత్తి కొనుగోలులో పరిమితి ఎత్తివేయాలి’

image

ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా నాయకుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం తేమ, నాణ్యతతో పాటు పరిమితుల పేరుతో కొత్త నిబంధనలు పెట్టి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు.