News November 4, 2025
కాకినాడ రూరల్‌లో వాళ్లదే సెటిల్మెంట్ల హవా!

కాకినాడ రూరల్‌లో కొందరు నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరపలో ఓ నాయకుడు ‘ఛైర్మన్’ పేరుతో పేకాట శిబిరాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీస్, రెవెన్యూ విభాగాలను ఇతరులకు అప్పగించారని, లేఔట్లు, సెటిల్‌మెంట్లు ఎమ్మెల్యే బంధువు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే.
Similar News
News November 4, 2025
పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి: జేసీ

జిల్లాలో పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జేసీ మంగళవారం మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతు ఈ-క్రాప్ బుకింగ్, ఈ పంటలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జంగారెడ్డిగూడెంలో సీసీఐ సెంటర్లో పత్తి పంట అమ్మకాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
News November 4, 2025
ఇల్లంతకుంట: ‘ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి’

అర్హులైనవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు తమ కలల ఇంటిని పూర్తి చేసుకోవాలన్నారు.
News November 4, 2025
భూములు త్వరగా గుర్తించండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చింతలపూడి 69.5 ఎకరాలు, ఉంగుటూరు 31.84, పోలవరం 78.92, ఏలూరు 2.02, కైకలూరులో 5 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలకు భూములను త్వరగా గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.


