News November 4, 2025
అమ్రాబాద్: పుష్కర కాలంగా ఇన్‌ఛార్జ్‌లే దిక్కు

నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) కార్యాలయానికి గత 12 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్‌లతో కొనసాగుతుంది. కీలక శాఖల పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచులకు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అంటున్నారు. రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ను నియమించాలని చెంచులు కోరుతున్నారు.
Similar News
News November 4, 2025
పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి: జేసీ

జిల్లాలో పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జేసీ మంగళవారం మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతు ఈ-క్రాప్ బుకింగ్, ఈ పంటలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జంగారెడ్డిగూడెంలో సీసీఐ సెంటర్లో పత్తి పంట అమ్మకాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
News November 4, 2025
ఇల్లంతకుంట: ‘ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలి’

అర్హులైనవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు తమ కలల ఇంటిని పూర్తి చేసుకోవాలన్నారు.
News November 4, 2025
భూములు త్వరగా గుర్తించండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చింతలపూడి 69.5 ఎకరాలు, ఉంగుటూరు 31.84, పోలవరం 78.92, ఏలూరు 2.02, కైకలూరులో 5 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలకు భూములను త్వరగా గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.


