News November 4, 2025
అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.
Similar News
News November 5, 2025
నారాయణపురం: కోతుల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన సంస్థాన్ నారాయణపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటి ఆవరణలో పనిచేస్తున్న శివ స్వామిపై కోతుల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివ స్వామి కిందపడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదుకు తరలించారు.
News November 5, 2025
ANU: పీజీ, బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు పీజీ, బీఈడి పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎం కామ్, రెండో సెమిస్టర్, తదితర ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను
వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుండి పొందవచ్చని చెప్పారు.
News November 5, 2025
సినీ ముచ్చట్లు

* చికిరి అంటే ఏంటో ఇవాళ ఉ.11.07కు తెలుసుకోండి: డైరెక్టర్ బుచ్చిబాబు
* అఖండ-2 మూవీ నుంచి ఇవాళ సా.6.03 గంటలకు మ్యాసీవ్ అప్డేట్ ఉంటుంది: తమన్
* ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఒక్కో సీన్‌కి స్క్రీన్ బద్దలైపోతుంది. చాలారోజుల తర్వాత సాంగ్స్‌లో కళ్యాణ్ గారు డాన్స్ ఇరగదీశారు: దేవీశ్రీ ప్రసాద్
*


