News April 10, 2024
మూడో టర్మ్‌కు క్రేజ్ పెరుగుతోంది: మోదీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి BJP విజయఢంకా మోగించే అవకాశాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా రెండు టర్మ్‌లు ముగిసే సరికి ప్రభుత్వాలు మద్దతు కోల్పోతుంటాయి. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి అనేది కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే భారత్ ఇందుకు మినహాయింపు. ఇక్కడ మా ప్రభుత్వం క్రేజ్ ఇంకా పెరుగుతోంది. ఈసారి 97కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

ఆదివారం T20 WC ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. WC చరిత్రలో హెడ్ టు హెడ్ చూస్తే కివీస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు తలపడ్డ 3 మ్యాచుల్లో ఆ జట్టే గెలిచింది. ప్రస్తుత టీమ్‌లో ఫిన్ అలెన్, సీఫర్ట్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రచిన్, ఫిలిప్, చాప్‌మన్, మిచెల్‌తో కూడిన కివీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. వీరికి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
News March 6, 2026
సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.
News March 6, 2026
నేపాల్ రిజల్ట్స్.. లీడింగ్‌లో RSP

హిమాలయ దేశం నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పార్టీ చీఫ్ రబి లామిచానే, సీనియర్ నేత బాలెన్ షా ముందంజలో కొనసాగుతున్నారు. RSP విజయం సాధిస్తే బాలెన్ షా(ఫొటోలో) PM అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రంలోపు రానున్నాయి.


