News November 4, 2025

వరంగల్: రైతన్నకు నిరాశ.. తగ్గిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొక్కజొన్న భారీగా తరలివచ్చింది. ఈ క్రమంలో సోమవారంతో పోలిస్తే నేడు మక్కల ద్వారా తగ్గింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095 ధర రాగా, నేడు రూ.2,055 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి రూ.14,500 ధర పలికింది. దీంతో రైతన్నలు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న తడవడం, ధర సైతం తగ్గడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Similar News

News November 4, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు: మణుగూరు డీఎస్పీ
✓దమ్మపేట: కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
✓జిన్నింగ్ మిల్లులు యధాతధంగా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్
✓భద్రాచలం ఎమ్మెల్యేను నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
✓సుజాతనగర్ హైస్కూల్ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం
✓బూర్గంపాడు – సారపాక రోడ్డుకు మరమ్మతులు
✓ములకలపల్లి: అడవి పందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్
✓పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా

News November 4, 2025

ఊట్కూర్ రైల్వే స్టేషన్ పుకార్లు తప్పు: ఎంపీ డీకే అరుణ

image

ఊట్కూర్ రైల్వే స్టేషన్ సాధన కోసం అఖిలపక్ష నాయకులు ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే (DPR)లో ఊట్కూర్ స్టేషన్ ఉందని, స్టేషన్ లేదనే ప్రచారం తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు. ఊట్కూర్‌లో క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

News November 4, 2025

సంగారెడ్డి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్స్‌ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. సంగారెడ్డి కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.