News April 10, 2024
గుర్తుతెలియని హోర్డింగులపై ఈసీ నిషేధం
AP: ఎన్నికల ప్రచార హోర్డింగులపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లపై తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు, చిరునామా ఉండాలని స్పష్టం చేసింది. గుర్తుతెలియని హోర్డింగులపై ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 127A ప్రకారం పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలపై చిరునామా లేకపోతే వాటిని నిషేధిస్తారు.
Similar News
News November 15, 2024
ఖలిస్థానీలతో కలిసి ర్యాలీ.. పోలీసుకు కెనడా క్లీన్ చిట్
ఈ నెల 3న ఖలిస్థానీ వేర్పాటువాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఓ పోలీసు అధికారికి కెనడా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలోకి చొరబడిన నిరసనకారులు భక్తులపై దాడి చేశారు. వారితో వెళ్లిన పోలీసు అధికారి హరీందర్ సోహీని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయితే, ఆయన చట్టబద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొంటూ తాజాగా నిర్దోషిగా ప్రకటించింది.
News November 15, 2024
‘టెంపుల్ టూరిజం’ బలాన్ని AP గుర్తించడం లేదా?
మన దేశానికున్న అతిపెద్ద బలం టెంపుల్ టూరిజం. కాశీ, అయోధ్య, ప్రయాగ వల్ల UPకి ఆదాయం బాగా పెరిగింది. హోటల్ సహా అనేక అనుబంధ రంగాలు రాణిస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, ఆంధ్రమహా విష్ణు వంటి ఆలయాలు AP సొంతం. వీటిపై మరింత ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజాన్ని పెంచితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం. మీరేమంటారు?
News November 15, 2024
గాడిద పాల పేరుతో ఘరానా మోసం
గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను ₹100 కోట్ల వరకూ మోసం చేసింది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను ₹1600కు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో AP, TG CMలు న్యాయం చేయాలని బాధితులు HYD ప్రెస్ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.