News November 4, 2025

FLASH: తాండూరులో RTC బస్సుకు యాక్సిడెంట్

image

తాండూరు(M)కరణ్‌కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూర్ వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా.. మరొకరు గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 5, 2025

క్యాబినెట్ మొత్తం జూబ్లిహిల్స్‌లోనే తిష్ట

image

ఇపుడు జరుగుతున్న ఉపఎన్నిక కేవలం ఒకే నియోజకవర్గంలో.. అయినా ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొత్తం క్యాబినెట్ మంత్రులందరినీ అధిష్ఠానం రంగంలోకి దించింది. మంత్రులను బాధ్యులుగా చేశారు. క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్‌ను జల్లెడపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ‘అమ్మా, అన్నా, అక్కా’ అంటూ మద్దతు కోరుతున్నారు. వీరితోపాటు నేరుగా సీఎం కూడా రంగంలోకి దిగారు.

News November 4, 2025

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

image

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్‌ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

News November 4, 2025

BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

image

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.