News November 4, 2025

KNR: టెక్నాలజీ హబ్‌కి శ్రీకారం చుట్టిన NRI

image

తను నిర్మించే నూతన గృహం యువతకు, ప్రజలకు ఉపయోగపడాలని వినూత్నంగా “రాజ గృహ” అనే పేరును నామకరణం చేసినట్లు NRI సరిగొమ్ముల హరిప్రసాద్ తెలిపారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో తను నిర్మించే గృహంలో గౌతమ బుద్ధ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన శ్రీకారం చుట్టారు. తను అమెరికాలో ఉన్నప్పటికీ గ్రామాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికై టెక్నాలజీ హబ్‌గా మారుస్తానని హరిప్రసాద్ పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

image

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్‌(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

News November 5, 2025

రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

image

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 5, 2025

TU: గెస్ట్ ఫ్యాకల్టీకి పోస్టుకు ఇంటర్వ్యూలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని సౌత్ క్యాంపస్ చరిత్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. సంబంధిత విభాగంలో 55% ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 7న ఉదయం 11.30గం.లకు బిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలి.